తెలంగాణ

telangana

ETV Bharat / state

కుమురం భీం అసిఫాబాద్​ రవాణా కార్యాలయంలో తనిఖీలు - tranceport

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని అంకుశాపూర్​ రవాణా శాఖ కార్యాలయాన్ని డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ శ్రీనివాస్​ తనిఖీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

శ్రీనివాస్​

By

Published : Mar 28, 2019, 12:41 AM IST

అసిఫాబాద్​ రవాణా కార్యాలయంలో తనిఖీలు
రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్​ శ్రీనివాస్​ కుమురం భీం ఆసిఫాబాద్​లోని అంకుశాపూర్​ రవాణా కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు కమిషనర్​ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యాలు సాధించిన ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తం రూ. 21 కోట్ల ఆదాయ లక్ష్యం ఉండగా రూ. 17 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పారదర్శకత కోసం అమలు చేస్తున్న ఆన్​లైన్ విధానం సక్రమంగా అమలు జరగడం లేదని విలేకరులు ప్రశ్నించగా తమ దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details