కుమురంభీం జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. షిఫ్టుల వారిగా విధులు నిర్వహిస్తూ పహారా కాస్తున్నారు. కుటుంబ సభ్యులను విడిచి ప్రజా క్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు.
కాగజ్‌నగర్‌లో కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు - కుమురంభీం జిల్లా తాజా వార్తలు
కొవిడ్ కట్టడిలో పోలీసుల సేవలు కీలకమైనవి. కుమురంభీం జిల్లాల్లో లాక్డౌన్ నిబంధనలను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ వైవీ సుధీంద్ర ఆదేశాలపై ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.
నిత్యం ఉదయం 10గంటల తర్వాత పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపు వేళలు దాటినా కొందరు వ్యాపారులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటున్నారు. కాగజ్ నగర్ పట్టణంలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘించి నిర్వహిస్తున్న పలు దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి:పదో రోజు పకడ్బందీగా ఆంక్షలు.. ఉల్లంఘించిన వారిపై చర్యలు