కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం వెంపల్లి వద్ద రైల్వే గేట్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. సుమారు గంట నుంచి గేట్ తెరుచుకోకపోవడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాగజ్‌నగర్ పట్టణం నుంచి సిర్పూర్ టి వెళ్లేదారిలో వెంపల్లి వద్ద రైల్వే గేట్ ఉంది. ఈ మార్గం గుండా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
వెంపల్లి రైల్వేగేట్‌లో సాంకేతిక సమస్య.. నిలిచిపోయిన వాహనాలు - Asifabad district news
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం వెంపల్లి వద్ద రైల్వేగేట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. సుమారు గంట నుంచి గేట్ తెరుచుకోకపోవడం వల్ల ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
వెంపల్లి రైల్వేగేట్, వెంపల్లి రైల్వేగేట్‌లో సాంకేతిక సమస్య
కొద్దిసేపు గేట్ వేస్తేనే వాహనాలు బారులు తీరి వేచి ఉంటాయి. వాహనాల రద్దీ దృష్ట్యా పైవంతెన నిర్మిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. ఏళ్లు గడుస్తున్నా వంతెన నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు సాంకేతిక కారణాలతో గేటు తెరుచుకోకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల అంబులెన్స్‌లు కూడా గేట్ వద్ద నిలిచిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రైల్వే సిబ్బంది గేటుకు మరమ్మతులు చేపట్టారు.