కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కడంబ అటవీప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మావోల కదలికలను పసిగట్టేందుకు డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఏర్పాటు చేశారు. చింతలమానేపల్లి మండలం గూడెం, ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో ఇన్‌ఛార్జి ఎస్పీ సత్యనారాయణ, ఓఎస్డీ ఉదయ్‌కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. కడంబ ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టు కీలక నేత మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ బృందం కడంబ పరిసర ప్రాంతాల్లో ఉన్నారనే తెలియడం వల్ల డ్రోన్ కెమెరాలు వినియోగించి పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.
డ్రోన్ కెమెరాలతో మావో కదలికలపై నిఘా - maoists
కడంబ అటవీప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మావోల కదలికలను పసిగట్టేందుకు డ్రోన్ కెమెరాల సహాయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.
మావోయిస్టులు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించాలంటే తెలంగాణ సరిహద్దున గల ప్రాణహిత నదిని దాటాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ప్రాణహిత పరివాహక ప్రాంతాలైన బెజ్జూరు, పెంచికలపేట, దహేగాం మండలాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుపుకోవాలంటూ మావోయిస్టులు ఇచ్చిన పిలుపు మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టినట్లు ఇన్‌ఛార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపారు.
ఇవీ చూడండి: పెద్దోళ్ల కోసం పేదోళ్ల పొట్ట కొట్టొద్దు: అజీజ్ పాషా