ఆర్టీసీ కార్మికుల సమ్మె 45వ రోజూ కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఐకాస నేతలు సంస్థ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 45 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లోకేశ్ వాపోయారు. వెంటనే కార్మిక నాయకులతో చర్చలు జరిపి వారి డిమాండ్లు పరిష్కరించాలన్నారు.
సునీల్ శర్మ దిష్టిబొమ్మ దహనం
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కార్మికులు సంస్థ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సునీల్ శర్మ దిష్టిబొమ్మ దహనం
ప్రభుత్వం దిగి వచ్చే వరకు కార్మికుల పోరు ఆగదని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఐకాస నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'భళా' ఉత్సవ్... మురిపించిన భద్రాద్రి బాలోత్సవ్