విద్యార్థులు పరీక్షల్లో భద్రం - DIST EDUCATIONAL OFFICER BIKSHAPATHI
ఈనెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.
విద్యార్థులు పరీక్షల్లో భద్రం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పదో తరగతి విద్యార్థులకు సందేహ నివృత్తి కార్యక్రమం నిర్వహించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా వందకు పైగా విద్యార్థులు చరవాణి ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. దూర ప్రాంత విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేర్చేందుకు బస్సు సదుపాయం కల్పిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి తెలిపారు. ఆయా శాస్త్రాలకు సంబంధించిన నిపుణులు... విద్యార్థులకు సలహాలు, సూచనలు అందించారు.