కొమురం భీ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కైరిగూడకు చెందిన గ్రామస్థులు వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. గ్రామానికి చెందిన విద్యార్థులు సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా... వరద ఉద్ధృతితో వాగులో చిక్కుకుపోయారు. సుమారు గంట పాటు ఓ ఎత్తైన గడ్డపై నిలబడ్డారు. నీటి ప్రవాహం తగ్గిపోయాక విద్యార్థులు సురక్షితంగా ఇంటికి వెళ్లిపోయారు.
వాగులో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితం - komuram bheem asifabad
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కైరిగూడ గ్రామానికి చెందిన విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా వరద ఉద్ధృతి పెరిగి వాగులో చిక్కిపోయారు.
వాగులో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితం