తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. నేతల అరెస్ట్​ - UREA

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యూరియా కోసం రైతన్నలు సోమవారం ఆందోళన చేపట్టారు. వీరికి కాంగ్రెస్​, భాజపా నేతలు హరీశ్​బాబు, రావి శ్రీనివాస్​ మద్దతుగా రహదారిపై బైఠాయించడం వల్ల పరిస్థితి అదుపుతప్పింది.

కాగజ్​నగర్​లో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. నేతల అరెస్ట్​

By

Published : Sep 24, 2019, 9:45 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఉన్నతాధికారులు వచ్చి రైతులకు హామీ ఇవ్వాలంటూ సిర్పూర్​ కాంగ్రెస్​ బాధ్యుడు పాల్వాయి హరీశ్​బాబు రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు హరీశ్​ బాబును పోలీస్​ స్టేషన్​కు తరలించేందుకు యత్నించారు. పోలీస్​ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న భాజపా నేత రావి శ్రీనివాస్​ పోలీస్​ వాహనానికి అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు. అనంతరం ఇరువురి నేతలను పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఏఎస్పీ సుధీంత్ర పరిస్థితి సమీక్షించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి, ఆర్డీవో శివకుమార్​ హామీ ఇచ్చారు.

కాగజ్​నగర్​లో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. నేతల అరెస్ట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details