లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం స్వానిధి పథకం బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. పురపాలక సంఘాలు.. అర్హులను గుర్తించి దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేయాలి. కానీ ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పురపాలికలో ఇప్పటివరకు 1,200 మంది వీధి వ్యాపారులుండగా... వారిలో 968 మందిని గుర్తించారు. అందులో కేవలం 52 మంది వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు.
కాగజ్‌నగర్‌లో బాలారిష్టాలు ఎదుర్కొంటున్న పీఎం స్వానిధి పథకం - street vendor loan problems in kagaznagar y not providing information in pm swanidhi
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పురపాలికలో ఇప్పటివరకు 1,200 మంది వీధి వ్యాపారులుండగా... వారిలో 968 మందిని పీఎం స్వానిధి పథకం గుర్తించారు. వీధి వ్యాపారులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో కేవలం 52 మంది వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు.
బాలారిష్టాలు ఎదుర్కొంటున్న పీఎం స్వానిధి పథకం
గుర్తింపు పొందిన వీధి వ్యాపారుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచడం, పత్రాలు జారీ చేయడం, రుణాలు ఇప్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వీధి వ్యాపారులు తెలిపారు. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో.. తమకు రుణం ఎప్పుడు వస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం ప్రభుత్వం పథకం పేరుతో యాప్‌నూ విడుదల చేసింది. వ్యాపారులు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ లావాదేవీలు నిర్వహిస్తే ప్రతి నెల రూ. వంద క్యాష్ బ్యాక్ వస్తుందని తెలిపింది.
TAGGED:
street vendors loan problems