తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగోబా ఆలయంలో సునీతా లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు - నాగోబా

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సందర్శించారు. మెస్రం వంశస్థులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

state-women-commission-chairperson-sunita-lakshmareddy-visits-nagoba-temple
నాగోబా ఆలయంలో సునీతా లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు

By

Published : Feb 10, 2021, 9:21 PM IST

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మెస్రం వంశస్థులు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

అనంతరం సునీతా.. వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. మెస్రం వంశస్థులతో కాసేపు ముచ్చటించారు. నాగోబాను దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆదివాసీల తరతరాల సంప్రదాయం.. నాగోబా జాతర వైభవం..

ABOUT THE AUTHOR

...view details