గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలంటే ప్రజల సహకారం అవసరమని... రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఆ శాఖ కమిషనర్ రఘునందన్ రావుతో కలిసి పర్యటించి... పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకున్న అధికారులకు పాలనాధికారి రాహుల్ రాజ్ స్వాగతం పలికారు.
'అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది' - telangana latest news
అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కమిషనర్ రఘునందన్ రావుతో కలిసి పర్యటించి... పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.
అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది
కాగజ్‌నగర్‌లోని ఈస్గాం పంచాయతీకి చేరుకుని పల్లె ప్రకృతి వనాన్ని, శ్మశాన వాటికను పరిశీలించారు. పల్లె ప్రగతి పనులపై ఆరా తీశారు. పంచాయతీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ నాటకమాడిన వివాహిత.. ఛేదించిన పోలీసులు