కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో వందకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు. కరోనా కారణంగా ప్రభుత్వం పాఠశాలలు మూసివేయడం వల్ల వారంతా ఉపాధి కోల్పోయారు. అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు శ్రీ సత్య సాయి సేవా సమితి సభ్యులు. దాదాపు వంద మంది ఉపాధ్యాయులకి నిత్యావసర సరుకులు అందజేశారు.
శ్రీ సత్య సాయి ఆశీస్సులతో.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం సంతోషంగా ఉందని సమితి సభ్యులు అన్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు.