తెలంగాణ

telangana

ETV Bharat / state

సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు - సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు

అసిఫాబాద్​లో జరిగిన సమత హత్యాచారం కేసు సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. హైకోర్టు ఆమోదంతో న్యాయ శాఖ ఆదిలాబాద్​ ఐదో అదనపు సెషన్స్ కోర్టును ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు
సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు

By

Published : Dec 11, 2019, 6:00 PM IST

Updated : Dec 12, 2019, 5:13 AM IST

స‌మ‌త కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదో అదనపు సెషన్స్‌ ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

ప్రత్యేక‌ కోర్టు ఏర్పాటు కావడం వల్ల రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. దిశ ఘ‌ట‌న త‌ర్వాత ప్రభుత్వం వేగంగా స్పందించిందని... స‌మ‌త కేసులో కూడా స‌త్వర న్యాయం అందేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం శాంతి భ‌ద్రత‌లకు అధిక ప్రాధాన్యతనిస్తుంద‌ని ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి స్పష్టం చేశారు. దోషుల‌కు వెంట‌నే శిక్షలు ప‌డేలా, బాధితుల‌కు స‌త్వర న్యాయం జ‌రిగేలా ప్రభుత్వం త‌మ వంతుగా కృషి చేస్తుంద‌ని అన్నారు. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:"సమత' కాదు... వారి ఉరే మాకు సంతృప్తి"

Last Updated : Dec 12, 2019, 5:13 AM IST

ABOUT THE AUTHOR

...view details