తెలంగాణ

telangana

ETV Bharat / state

వడగండ్ల వర్షానికి నేలరాలిన మామిడి పంట - కుమురం భీం జిల్లాలో వడగండ్ల వర్షం

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో వడగండ్ల వర్షానికి మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Soil mango crop for hail rain
వడగండ్ల వర్షానికి నేలరాలిన మామిడి పంట

By

Published : Apr 26, 2020, 1:08 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షానికి మామిడి పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు తెలిపారు. రెబ్బెనలో 210 ఎకరాలు... సిర్పూర్ టీ కాగజ్​నగర్ మండలాలలో 55 ఎకరాల్లో మామిడి పంట నేల రాలి రైతులకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బలమైన గాలులు, వడగండ్లకు 70 శాతం పంట దెబ్బతిందని తెలిపారు. పంట నష్టం విలువ రూ. 67 లక్షలు ఉంటుందని వెల్లడించారు. పరిహారం కోసం నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు.

నేలరాలిన మామిడి పంట

ABOUT THE AUTHOR

...view details