కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నుంచి మహారాష్ట్రలోని విరూర్కు బొలెరో వాహనంలో తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వాహనం స్వాధీనం చేసుకొని డ్రైవర్ మహేష్, యజమాని వెంకటేష్పై కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - smuggled RATION RICE SIZED AT SIRPUR T
మంచిర్యాల జిల్లా నుంచి మహరాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల పోలీసులు పట్టుకున్నారు. సుమారు 15 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
smuggled RATION RICE SIZED AT SIRPUR T