తెలంగాణ

telangana

ETV Bharat / state

సిర్పూర్​ కాగితం మిల్లులో ఉత్పత్తి పునరుద్ధరణ - సిర్పూర్​ పేపర్​ మిల్లు

సిర్పూర్​ కాగితం మిల్లు పనులను జేకే యాజమాన్యం వేగవంతం చేసింది. పూర్తి స్థాయిలో కాగితం ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది.

పేపర్​ మిల్లు

By

Published : Mar 30, 2019, 4:53 PM IST

నూతన యంత్రాన్ని ప్రారంభిస్తున్న యాజమాన్యం
కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్ కాగజ్​నగర్ కాగితం మిల్లు పునరుద్ధరణ చర్యలు శరవేగంగా సాగుతున్నాయి. 2018 ఆగస్టు 2న మిల్లును జేకే యాజమాన్యం తమ అధీనంలోకి తీసుకున్న తర్వాత మరమ్మతు పనులు చేపడుతోంది. రెండు నెలల క్రితమే ఏడో నంబరు కాగితం యంత్రం నుంచి ఉత్పత్తి ప్రారంభం కాగా.. ఇవాళ ఎనిమిదో ఉత్పత్తి యంత్రాన్ని ప్రత్యేక పూజల అనంతరం ప్రయోగ పరిశీలన చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్​ ఏ.ఎస్​. మెహతా, డైరెక్టర్​ కుమారస్వామి, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

200 నుంచి 250 టన్నుల కాగితం ఉత్పత్తి

నూతన యంత్రం నుంచి రోజుకు దాదాపు 200 నుంచి 250 టన్నుల కాగితం ఉత్పత్తి చేయనున్నట్టు పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్​ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి :కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!

ABOUT THE AUTHOR

...view details