కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ పేపర్ మిల్లులో జరిగిన ప్రమాద ఘటనపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పందించారు. రాత్రి 10 గంటలకు జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని తెలిపారు. ఘటనలో గాయపడ్డ ఐదుగురికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వంతో చర్చించి ఎక్స్గ్రేషియా అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
'మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తాం...' - SIRPUR MLA KONERU KONAPPA LATEST NEWS
కాగజ్నగర్ పేపర్ మిల్లు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా అందజేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు.
!['మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తాం...' koneru konappa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6174653-853-6174653-1582449755245.jpg)
'మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తాం...'