కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(MLA Koneru Konappa) రమాదేవి దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. తమ 42వ పెళ్లిరోజును పురస్కరించుకుని ఒక పేద జంటకు వివాహం జరిపించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన సంగీత, ప్రేమ్ సాగర్‌కు పెళ్లి జరిపించారు. కోనేరు కోనప్ప(MLA Koneru Konappa), సతీమణి రమాదేవితో కలిసి వధూవరులకు నూతన వస్త్రాలు, మంగళ సూత్రం, మెట్టెలు అందించారు.
MLA Koneru Konappa: పేద జంటకు పెళ్లి చేసిన ఎమ్మెల్యే దంపతులు - ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తాజా వార్తలు
తమ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక పేదింటి ఆడబిడ్డకు వివాహం జరిపించి మంచి మనసు చాటుకున్నారు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(MLA Koneru Konappa) రమాదేవి దంపతులు. నూతన వధూవరులకు మంగళసూత్రం, మెట్టెలు అందజేసి తమ నివాసంలోనే ఘనంగా పెళ్లి జరిపించారు.
MLA Koneru Konappa: పేద జంటకు పెళ్లి చేసిన ఎమ్మెల్యే దంపతులు
తమ నివాసంలో వధూవరుల కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహాన్ని నిరాడంబరంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. కల్యాణ లక్ష్మి పథకం అందేలా చూసి అన్నీ విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వివాహ వేడుకలో కోనేరు కోనప్ప సోదరుడు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణరావు, కుమారుడు, కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు వంశీ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Anandaiah: 'కళ్లలో పసరుపోస్తే కరోనా తగ్గిందా.. అది అసాధ్యం'