కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మైనింగ్ వల్ల నష్ట పోయిన ప్రజలకు వినియోగించాల్సిన డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫౌండేషన్ నిధులు(డీఎంఎఫ్) దుర్వినియోగం అయ్యాయని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. డీఎంఎఫ్ నిధుల ఖర్చు వివరాల కోసం సమాచార హక్కు ద్వారా ఆర్జీ చేసుకోగా... గత సంవత్సరం 24 లక్షల రూపాయలను మధ్యాహ్న భోజనం కోసం కేటాయించారని అధికారులు తెలిపారన్నారు.
'డీఎంఎఫ్ నిధులు ఏం చేశారో చెప్పాల్సిందే..' - sirpur congress party incharge harish babu
కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి డీఎంఎఫ్ నిధులు వినియోగించారో లేదో తెలపాలని డిమాండ్ చేస్తూ... సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ డా. పాల్వాయి హరీష్ బాబు ఆందోళన చేశారు.
'డీఎంఎఫ్ నిధులు ఏం చేశారో చెప్పాల్సిందే...'
ప్రభుత్వ నిధులతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నప్పుడు సొంత నిధులతో పెడుతున్నామని ఎందుకు చెప్పుకోవడం అని ప్రశ్నించారు. డిఎంఎఫ్ నిధుల విషయంలో పాలనధికారి కఠినంగా వ్యవహరిస్తుండటం వలనే ఆయనపై కక్ష గట్టారని అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పష్టత ఇవ్వాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి:'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'