కుమురం భీం జిల్లాలో కొనసాగుతున్న సమ్మె - కుమురం భీం జిల్లాలో కొనసాగుతున్న సమ్మె
బొగ్గుగనుల్లో ఎఫ్‌డీఐలను కేంద్రం ఆహ్వానించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గుగని కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి.
కుమురం భీం జిల్లాలో కొనసాగుతున్న సమ్మె
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియా బొగ్గు గనుల్లో కార్మికులు 100శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగారు. నాలుగు జాతీయ సంఘాలతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మద్దతు పలికాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి యాజమాన్యాన్ని ప్రైవేటీకరణం చేసేందుక యత్నిస్తున్నాయని కార్మిక సంఘనాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. లేనియెడల ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
TAGGED:
singareni karmikula samme