పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌక్‌లో చేపట్టిన ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
'వెంటనే సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను రీకాల్ చేయాలి' - protest on caa and nrc acts
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లోని పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు ధర్నా చేపట్టాయి. తక్షణమే సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా వ్యతిరేక విధానాలను ఆపాలి : ప్రజా సంఘాలు
అనంతరం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. వెంటనే సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.