కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో నాలుగో వారం షష్ఠి బోనాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. వ్యవసాయం ప్రధానంగా సాగే ఈ ప్రాంతంలో ప్రథమంగా పండించిన పంటను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత. బోనాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు.
మల్లన్న స్వామి ఆలయంలో షష్ఠి బోనాలు - Shashti Bonalu at Mallanna Swamy Temple
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో నాలుగో వారం షష్ఠి బోనాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఘనంగా మల్లన్న బోనాలు