బంగారు తెలంగాణ వద్దు... చదువుల తెలంగాణ ముద్దు - బంగారు తెలంగాణ వద్దు... చదువుల తెలంగాణ ముద్దు
కొమురం భీం జిల్లా కేంద్రం విద్యా రంగంలోని అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
బంగారు తెలంగాణ వద్దు... చదువుల తెలంగాణ ముద్దు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్ధానాలు ఇచ్చింది కానీ... నేటికీ అవి నెరవేరడంలేదంటూ వాపోయారు. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందిచారు.