Temperature Drop in Telangana Today: రాష్ట్రంలో చలి భయపెడుతోంది. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. సోమవారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యు)లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరుగుతోందని వాతావరణశాఖ తెలిపింది.
మంగళ, బుధవారాల్లో పగలు పొడిగా, రాత్రిపూట చలిగా ఉంటుందని ఈ శాఖ వివరించింది. పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తోంది.