కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా.. ఏడో రోజైన శనివారం ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారి దర్శనం - ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారు కాగజ్నగర్
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో దేవి శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని కన్యకపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇందుకోసం అమ్మవారిని రూ. 11 లక్షల 11 వేల 111 నగదుతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
![ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారి దర్శనం ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారి దర్శనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9292473-thumbnail-3x2-devi.jpg)
ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారి దర్శనం
ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారి దర్శనం
ధనలక్ష్మి అవతారంలో అమ్మవారిని రూ. 11 లక్షల 11 వేల 111 నగదుతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందుకోసం రూపాయి నుంచి రెండు వేల నోటు వరకు ఉపయోగించారు. లక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి:సంప్రదాయ దుస్తులతో.. దాండియా నృత్యాలు