తెలంగాణ

telangana

ETV Bharat / state

podu lands protest: రెండో రోజు ఆగని పోరు.. అధికారులతో రైతుల తీవ్ర వాగ్వాదం - podu news

podu lands protest: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా మండలం బొందలగడ్డలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటవీ అధికారుల వైఖరికి నిరసనగా రెండ్రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ ఉదయం అడ్డాఘాట్‌ వద్ద పోడు భూముల్లో విత్తనాలు వేసేందుకు రైతులు యత్నించగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో పోడు రైతులు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం తెలెత్తింది.

podu lands protest
: రెండో రోజు పోడు పోరు

By

Published : Jun 28, 2022, 7:42 PM IST

podu lands protest: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతులు, అధికారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రౌటసంకేపల్లి గ్రామానికి వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామస్థులు నిర్బంధించారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేవరకు అధికారులను వెళ్లనిచ్చేది లేదని పట్టుపట్టారు. రౌటసంకేపల్లి పంచాయతి పరిధిలోని అడ్డాఘాట్ వద్ద విత్తనాలు వేసేందుకు ఉదయం పోడురైతులు సిద్ధమయ్యారు. అక్కడికి చేరుకున్న రెవెన్యూ, అటవీశాఖ అధికారులు రైతులను అడ్డుకున్నారు. గ్రామంలో వారికి నచ్చజెప్పేందుకు అధికారులకు మధ్య చర్చలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే: రౌటసంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొందలగడ్డలో నిన్న అటవీసిబ్బందిని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో 300 ఎకరాలకు ఆర్​ఎఫ్​ఆర్ కింద రెవెన్యూశాఖ పట్టాలిచ్చింది. ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే సంబంధిత భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీశాఖ సిబ్బంది బొందలగడ్డకి వెళ్లారు. అధికారుల తీరుపై ఆందోళనకు దిగిన గ్రామస్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు వదిలిపెట్టేది లేదని స్పష్టచేశారు. అక్కడికి వెళ్లకుండా ఎడ్లబండ్లను అడ్డుగా పెట్టగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. ఇవాళ ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోని అడ్డాఘాట్​లో రైతులు ఆదివాసీ, ఎర్రజెండాలతో ప్రదర్శనగా వెళ్లి పోడుభూములు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు వారిని అడ్డుకుని చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే అధికారులను పోడు రైతులు నిర్బంధించారు. అధికారులు గ్రామం నుంచి వెళ్లకుండా రహదారి దిగ్బంధించారు. ప్రభుత్వం దిగొచ్చి పరిష్కారం చూపాల్సిందేనని పట్టుబట్టారు.

రౌటసంకేపెల్లి గ్రామపంచాయతీ అడ్డఘాట్ గ్రామంలో పోడు రైతులు రెండవ రోజు కూడా పోడు పోరు కొనసాగిస్తున్నారు. ఆదివాసీ మహిళలు ఈ రోజు పోడు భూములు దున్నుతూ విత్తనాలు నాటారు. ఎర్రజెండాలు, ఆదివాసీ జెండాలను పట్టుకొని నిరసన తెలుపుతూ విత్తనాలు వేశారు. ఎట్టి పరిస్థితులలో భూములను వదిలేది లేదని రైతులు పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు వచ్చినా వినేది లేదని స్పష్టం చేశారు. ఎప్పటికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు ఈ పోడు కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.

రెండో రోజు ఆగని పోరు.. అధికారులతో తీవ్ర వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details