తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో కొనసాగుతున్న నామినేషన్ల పరంపర - కాగజ్​నగర్ మున్సిపల్ ఎలక్షన్స్ 2020

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పురపాలికలో నామినేషన్ల పరంపర కొనసాగుతోంది. నామపత్రాల స్వీకరణ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షించారు.

second day nominations at kagajnagar in kumrambheem asifabad district
కాగజ్​నగర్​లో కొనసాగుతున్న నామినేషన్ల పరంపర

By

Published : Jan 9, 2020, 4:11 PM IST

కాగజ్​నగర్​లో కొనసాగుతున్న నామినేషన్ల పరంపర

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ మున్సిపాలిటీలో నామపత్రాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు 5 నామపత్రాలు దాఖలయ్యాయి. తెరాస అభ్యర్థులు... 21వ వార్డు నుంచి రాచకొండ గిరీశ్​, 14 వ వార్డు నుంచి నసీమ భాను,17 వ వార్డు నుంచి విజయ్ యాదవ్ నామ పత్రాలు దాఖలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి 16వ వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థి కచ్చకాయల జ్యోతి, 26 వ వార్డు నుంచి వసీమున్నిసా నామినేషన్​ వేశారు. పార్టీల తరఫున నామపత్రాలు దాఖలు చేసినప్పటికీ అభ్యర్థులెవరూ బీ ఫారమ్ జతపరచలేదని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details