తెలంగాణ

telangana

ETV Bharat / state

పోతేపల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు.. నిందితుల్లో ఎంపీటీసీ - searching for hidden treasure in pothepally

కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలం పోతేపల్లిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం కొంతమంది వ్యక్తులు తవ్వకాలు జరిపారు. గ్రామస్థుల సమాచారంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ ఎంపీటీసీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

hidden treasure
పోతేపల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

By

Published : Feb 25, 2020, 8:16 PM IST

కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పోతేపల్లిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో నిన్న అర్ధరాత్రి కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపడుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు.

గ్రామస్థుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బికాస్ గరామి, శంబు మండల్, రామకృష్ణ పాల్, కృష్ణ గుప్తా, హసన్​మండల్, దిలీప్ బిశ్వాస్, నిమంసు మండల్, శంకర్​ సర్కార్​లను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన బికాస్ గరామి నగర్​ ఎంపీటీసీగా ఉన్నారు.

నిందితుల నుంచి రూ.22 వేల నగదు, 8 చరవాణులు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

పోతేపల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు.. నిందితుల్లో ఎంపీటీసీ

ఇవీచూడండి:ఆడపిల్ల పుట్టిందని... పక్కనోళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లాడు!

ABOUT THE AUTHOR

...view details