నవంబర్ 24న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామ శివారులో అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యులు కేశపాగుల రాములు అన్నారు. గురువారం జిల్లాలో ఆయన పర్యటించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
'బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం' - Sc, St commission chairman in toor
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామ శివారులో నవంబర్ 24న అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యులు కేశపాగుల రాములు అన్నారు
!['బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం' Sc, St commission](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5282837-thumbnail-3x2-df.jpg)
కుమురం భీం జిల్లాలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పర్యటన
జరిగిన ఘటన, చర్యలపై నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్ ప్రశాంతి, రాజీవ్ గాంధీ హన్మంతు, ఎస్పీలు శశిధర్ రాజు, మల్లారెడ్డిలతో సమావేశం నిర్వహించారు. ఘటన చాలా బాధాకరమని, న్యాయం చేస్తామని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతికి ఆదేశించారు.
కుమురం భీం జిల్లాలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పర్యటన
ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు