తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో ఘనంగా షష్ఠి మల్లన్న ఉత్సవాలు - komuaravelli

షష్ఠి మల్లన్న ఉత్సవాలను పురస్కరించుకుని.. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లోని ఇస్​గన్ శివమల్లన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మార్గశిర మాసంలో నాలుగు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

Sashti Mallanna festivals are celebrated in Kagaznagar
Sashti Mallanna festivals are celebrated in Kagaznagar

By

Published : Dec 27, 2020, 6:05 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లోని ఇస్​గన్ శివమల్లన్న స్వామి ఆలయంలో షష్టి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్గశిర మాసంలో నాలుగు వారాల పాటు జరిగే ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై.. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

కాగజ్​నగర్​తో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు ఈ ఉత్సవాలల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఉదయాన్నే ఆలయానికి చేరుకుంటారు. బెల్లం, పాయసం, అన్నం కూరగాయలతో బోనం చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. అనంతరం కోరమీసాల స్వామిని దర్శించుకుంటారు.

ఇదీ చదవండి:జగిత్యాల మల్లన్న ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details