కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. అధిక జన సంచారం ఉన్న ప్రాంతాల్లో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో నిరంతరం శానిటైజేషన్ చేస్తున్నారు.
కాగజ్‌నగర్‌లో కమిషనర్ పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు - తెలంగాణ వార్తలు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాగజ్‌నగర్‌లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే పట్టణ ప్రయాణ ప్రాంగణంలో శానిటైజేషన్ పనులు చేపట్టారు. ఈ పనులను కమిషనర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు.
కాగజ్‌నగర్‌లో పారిశుద్ధ్య పనులు, కాగజ్‌నగర్‌లో కరోనా కేసులు
ఈ పారిశుద్ధ్య పనులను కమిషనర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ప్రయాణికులకు వైరస్ పట్ల అవగాహన కల్పించారు. అందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని తెలిపారు. సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని అన్నారు.
- ఇదీ చదవండి:ట్రాఫిక్ నియమాలపై సైబరాబాద్ పోలీసుల అవగాహన