కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. తమకు రావాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ పురపాలక కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
బకాయిలను చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
తమకు రావాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
కాగజ్‌నగర్ పురపాలికలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు నుంచి అధికారులు ప్రతి నెలా కోత విధిస్తున్నప్పటికీ.. తమ ఖాతాల్లో జమ కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద కాలంలో ఆదుకునే పీఎఫ్ సొమ్ము అందని ద్రాక్షగానే మిగులుతోందని వాపోయారు. పీఎఫ్ సొమ్ము చెల్లించాలంటూ ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు చేపడుతున్నా.. అధికారులు, పాలక వర్గం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఆందోళనలు, ధర్నాలు చేపట్టినప్పుడు సమస్యను పరిష్కరిస్తామంటూ నచ్చజెప్పడం, తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి.. వరదలతో పాటే వ్యాధులు... పొంచి ఉన్న డయేరియా, మలేరియా, డెంగీ..