సమత కేసులో ముగిసిన వాదనలు.. 27న తీర్పు - సమత కేసులో ముగిసిన వాదనలు
15:53 January 20
సమత కేసులో ముగిసిన వాదనలు.. 27న తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో వాదనలు ముగిశాయి. ఈనెల 27న ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కుమురం భీం జిల్లాలోని అటవీ ప్రాంతంలో గతేడాది నవంబర్ 24న సమతపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి డిసెంబర్ 14న నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణ కోసం డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 23 నుంచి 31 వరకు సాక్షులను విచారించారు. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ మధ్య వాదనలు జరిగాయి.
ఇదీ చూడండి: పెద్దపల్లి పురపాలికలో డబ్బు పంచిన తెరాస అభ్యర్థి సోదరుడు