- నవంబర్ 24న కుమురం భీం జిల్లాలోని ఎల్లాపటర్ ఊళ్లోకి వెళ్లింది. సాయంత్రం భర్త వచ్చేసారికి కనిపించ లేదు.
- భార్య కోసం వెతికిన భర్త చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
- నవంబర్ 25న సమత అత్యంత దయనీయ పరిస్థితిలో శవమై కనిపించింది. హత్యాచారం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
- నవంబర్ 27న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
- శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరించిన పోలీసులు.. విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని విన్నవించారు.
- పోలీసుల వినతి మేరకు డిసెంబరు 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు.
- డిసెంబరు 14న నిందితులపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.
- డిసెంబరు 23 నుంచి 31 వరకు సాక్షుల విచారణ జరిగింది.
- 50 రోజుల పాటు ప్రత్యేక కోర్టులో సమత కేసు విచారణ జరిగింది.
- ప్రత్యేక కోర్టు దోషులకు ఇవాళ మరణ శిక్ష విధించింది.
నేరం నుంచి శిక్ష పడే వరకు
తమ పిల్లలైనా ఎటువంటి కష్టాలు పడకుండా వారు కన్న కలల్ని సాకారం చేసుకోవాలని, బాగా బతకాలని పుట్టిన ఊరుని వదిలారు. ఉదయం లేవగానే చేతిలో సంచితో, తమ పిల్లల భవిష్యత్ గురించిన ఆలోచనలతో ఊరూరా తిరుగుతూ చిరు వ్యాపారం చేసుకునే ఆ ఇల్లాల్ని మదమెక్కిన రాక్షసులు చెరిచారు. జంతువుల్లా మీద పడి అతి కిరాతకంగా హత్యాచారం చేశారు. పశువుల్లా ప్రవర్తించిన ఈ కామాంధులకు న్యాయ స్థానంలో తగిన శిక్ష పడింది. 66రోజుల్లోనే తీర్పు వెల్లడైంది.
నేరం నుంచి శిక్ష పడే వరకు
Last Updated : Jan 30, 2020, 4:42 PM IST