కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో సదరం శిబిరం నిర్వహించారు. వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు కాగజ్‌నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో సదరం శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేశారు.
కాగజ్‌నగర్‌లో సదరం శిబిరం - latest news of kumurambheem district
కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు సదరం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి కుమురం బాలు శిబిరాన్ని పరిశీలించారు.
![కాగజ్‌నగర్‌లో సదరం శిబిరం sadaram camp for def people at kagaz nagar in kumurambheem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7930837-343-7930837-1594127233560.jpg)
కాగజ్‌నగర్‌లో సదరం శిబిరం నిర్వహణ
మొదట అసిఫాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపినప్పటికీ దివ్యాంగుల సౌకర్యార్థం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరంలో 65 మంది దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించనుండగా 40 రెన్యువల్, 25 కొత్తవారికి స్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లా వైద్యాధికారి కుమురం బాలు శిబిరాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.