కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ ముందస్తుగా ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులు పహారాగా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకోవడం వల్ల తోపులాట జరిగింది. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఇంటి ముట్టడిలో ఉద్రిక్తత... తోపులాట - tsrtc employees strike - 2019 in asifabad
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు
TAGGED:
tsrtc employees strike-2019