తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యాధికారి ఇంట్లో దొంగల బీభత్సం - robbery at kumaram bhim district

ఇంటికి తాళం వేసి ఓ విద్యాధికారి కుటుంబంతో సహా ఊరికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు... చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో చోటుచేసుకుంది.

విద్యాధికారి ఇంట్లో దొంగల బీభత్సం

By

Published : Nov 11, 2019, 5:54 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలోని ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మండల విద్యాధికారి బిక్షపతి గత రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్​ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు నిన్న రాత్రి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.

ఉదయం తాళాలు పగులగొట్టి ఉండటం చూసిన స్థానికులు... యజమానులకు సమాచారం అందించారు. యజమానలు పోలీసులకు సమాచారం అందించగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవడం వల్ల ఎంత సొమ్ము చోరీకి గురైందని తెలియదని పోలీసులు పేర్కొన్నారు.

విద్యాధికారి ఇంట్లో దొంగల బీభత్సం

ఇదీ చూడండి: జగన్..​ కేసీఆర్​ను చూసి నేర్చుకో: పవన్​ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details