కుమురంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణం ఆర్ఆర్ఓ కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తి లోడుతో వెళ్తున్న బొలెరో ట్రక్, ఆటో ఢీ కొన్నాయి. బొలెరో డ్రైవర్ కృష్ణకు స్వల్ప గాయాలు కాగా ఆటోలోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పత్తిలోడుతో ఉన్న ట్రక్కు, ఆటో ఢీ.. పలువురికి గాయాలు - పత్తిలోడు ట్రక్కు
కుమురంభీం జిల్లా కాగజ్నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తి లోడుతో వెళ్తున్న ట్రక్, ఆటో ఢీ కొని ఐదుగురికి గాయాలయ్యాయి.
పత్తిలోడుతో ఉన్న ట్రక్కు, ఆటో ఢీ.. పలువురికి గాయాలు
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి :'మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం'