ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన కాట కల్యాణిని పలువురు అభినందిస్తూ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన ఇడ్లి విక్రేతలు శేషగిరి - అనిత దంపతుల చిన్న కూతుర్తైన కల్యాణి ఇంటర్మీడియట్లో 992 మార్కులు సాధించింది. పేదింటిలో పుట్టినప్పటికీ పట్టుదలతో చదివి ఉత్తమ మార్కులు సాధించిన కల్యాణిని ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు.
పేదింటి విద్యార్థినికి ప్రోత్సాహకాలు.. ఇండియన్ బ్యాంక్ ప్రోత్సాహకం - ఇంటర్ టాపర్ కుమురం భీం కాగజ్‌నగర్
ఇంటర్లో 992 మార్కులతో సత్తాచాటిన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన కల్యాణిని పలువురు అభినందిస్తూ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. భేటీ బచావ్ - భేటీ పడావ్లో భాగంగా ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఆమెకు నగదు ప్రోత్సాహకాన్ని అందించారు.
విద్యార్థినికి ప్రోత్సాహకాలు
ఇండియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్రీనివాస్, ఆసిఫాబాద్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ నాయక్‌లు... ఆమెకు భేటీ బచావ్, భేటి పడావ్లో భాగంగా నగదు ప్రోత్సాహకం అందించారు. భవిష్యత్‌లో ఉన్నత విద్య చదివేందుకు రుణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంక్ వారు అందిస్తున్న సాయానికి విద్యార్థిని కల్యాణి ధన్యవాదాలు తెలిపింది.
ఇవీ చూడండి: గ్రహణ సమయం.. సూర్యుడిని మింగేస్తున్న చంద్రుడు