తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆక్రమణకు గురైన స్థలాల్లో రెవెన్యూ అధికారుల సర్వే

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా చారిగాం, బోరిగాం ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాగా.. వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్​ ఆదేశించగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.

revenue officers survey at kagaznagar
http://10.10.50.85:6060/reg-lowres/26-September-2020/tg-adb-25-26-akramitha-sthalallo-survey-av-ts10034_26092020185437_2609f_02318_339.mp4

By

Published : Sep 26, 2020, 8:25 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ మండల శివారులో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఇటీవలి కాలంలో కాగజ్​నగర్​ మండలం చారిగాం, బోరిగాం శివారులోని ప్రభుత్వ భూమి కబ్జాలకు గురైంది. గత కొంతకాలంగా అక్కడ భవన నిర్మాణాలు చేపడుతున్నారని.. కొంతమంది దళారులు ప్లాట్లుగా చేసి అమ్మకాలు కూడా జరిపినట్లుగా స్థానిక నాయకులు కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లగా సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు.

పాలనాధికారి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు చారిగాం, బోరిగాం ప్రాంతాల్లో భవన నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం నివేశన స్థలాలున్న వారి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ జయలక్ష్మి తెలిపారు.

ఇదీ చూడండి :పేదింటి బిడ్డకు పెద్ద జబ్బు... ఆదుకోండి ప్లీజ్​...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details