కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో రెవెన్యూ అధికారులు పట్టణ పరిధిలోని వలస కూలీల వివరాలు సేకరిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించాలన్న కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని కాగజ్ నగర్ తహశీల్దార్ కార్యాలయంలో సహాయక కేంద్రం ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చిన వలస కూలీల వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత వారందరినీ వారి స్వస్థలాలకు తరలిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
కాగజ్ నగర్లో వలస కూలీల వివరాల సేకరణ - Revenue Officers Noted Migration Labor Details In kagaj nagar
లాక్డౌన్ వల్ల వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలెపెట్టింది. ఈ మేరకు కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో వలస కూలీల వివరాలు సేకరించారు.
కాగజ్ నగర్లో వలస కూలీల వివరాల సేకరణ