కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై జరిగిన దాడి కేసులో జైలుకు వెళ్లిన కోనేరు కృష్ణ బెయిల్పై విడుదలయ్యారు. దాదాపు రెండు నెలలు జైలులో ఉండి విడుదలైన కృష్ణకు సోదరుడు కోనప్ప, అతని అనుచరులు స్వాగతం పలికారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కృష్ణ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడైన కృష్ణ జూన్ 30న అటవీ అధికారిణిపై కర్రలతో జరిపిన దాడిలో అతనితో పాటు మరి కొంత మంది అనుచరులు అరెస్టు అయ్యారు.
కోనేరు కృష్ణ బెయిలు పై విడుదల - అటవీశాఖ అధికారిణి
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సార్సాలలో అటవీ అధికారిణిపై దాడి కేసులో కోనేరు కృష్ణ జైలునుంచి బెయిల్పై విడుదలయ్యారు. సోదరుడు కోనప్ప, అతని అనుచరులు కృష్ణకు స్వాగతం పలికారు.
కోనేరు కృష్ణ బెయిలు పై విడుదల