తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడుంబా స్థావరాలపై దాడులు - gudumba stavaralu

రెబ్బెన మండలం దుర్గాపూర్ గ్రామ సమీపంలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి.. తయారీ సామగ్రిని ధ్వంసం చేశారు.

rebbena si ride on gudumba stavaralu at durgapur  rebbena mandal komaram bheem asifabad district
గుడుంబా స్థావరాలపై దాడులు

By

Published : Apr 26, 2020, 4:22 PM IST

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం దుర్గాపూర్ గ్రామ సమీపంలోని వాగులో గుడుంబా తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ ఆ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 2 వేల లీటర్ల బెల్లం పానకం, గుడుంబా తయారీకి అవసరమైన సామగ్రిని గుర్తించి ధ్వంసం చేశారు.

లాక్‌డౌన్‌ సందర్భంలో మద్యపానం నిషేధమని... సార క్రయవిక్రయాలు జరిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. ఎవరైనా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని... వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి:కరోనాను మోసుకెళ్తూ... పోలీసులకు చిక్కారు..!

ABOUT THE AUTHOR

...view details