తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 30కుటుంబాలకు నిత్యవసర సరుకులు - నిత్యావసర సరుకులు

సార్సాల దాడి ఘటనలో జైలుపాలైన కుటుంబాలపై ఈటీవీ భారత్​ ప్రసారం చేసిన కథనానికి భాజపా నాయకులు స్పందించారు. 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు.

30కుటుంబాలకు నిత్యవసర సరుకులు

By

Published : Aug 1, 2019, 12:51 PM IST

30కుటుంబాలకు నిత్యవసర సరుకులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుమురం భీం జిల్లా సార్సాల దాడి ఘటనలో జైలుపాలైన వారి కుటుంబాల ధీన స్థితిపై ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనానికి భాజపా నాయకులు రావి శ్రీనివాస్ స్పందించారు. జైలు పాలైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంటిల్లిపాది జైలుకెళ్లి ఒంటరిగా ఉంటున్న బాలిక లక్ష్మీని ఓదార్చారు. కంటి చూపు సరిగా లేని తల్లికి సపర్యలు చేస్తున్న చిన్నారి స్వప్న బాగోగులు తెలుసుకున్నారు. జైలుకెళ్లిన 30 కుటుంబాల సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కేసులో అమాయక రైతులు ఇరుక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details