కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని సంఘం బస్తీలోని ఓ ఇంట్లో భారీ ఎత్తున రాయితీ బియ్యం నిల్వ ఉంచారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు చేపట్టారు.
60 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం... ఒక వ్యక్తి అరెస్టు - కాగజ్‌నగర్‌లో రేషన్‌బియ్యం స్వాధీనం
ఓఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.
60 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం... ఒక వ్యక్తి అరెస్టు
ఈ తనిఖీల్లో మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనపర్చుకున్నారు. ఈమేరకు మహమ్మద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.