కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు నుంచి పదో తేదీ వరకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా జడ్పీ ఛైర్మన్ కోవా లక్ష్మి ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఉచితంగా 12కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ బియ్యం తీసుకున్నారు. ప్రతి రోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు టోకెన్ల ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఆసిఫాబాద్‌లో రేషన్ బియ్యం పంపిణీ షురూ.. - Ration Rice Distribution in Kumarambhim Asifabad district
లాక్డౌన్ సందర్భంగా తెలంగాణ ప్రజలు, రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డుదారుల్లో ప్రతీ ఒక్కరికీ 12 కిలోల రేషన్ బియ్యం సరఫరాను ఇవాళ ప్రభుత్వం ప్రారంభించింది. కుమురం భీం జిల్లా కేంద్రంలో జడ్పీ ఛైర్మన్ కోవా లక్ష్మి ప్రారంభించారు.
![ఆసిఫాబాద్‌లో రేషన్ బియ్యం పంపిణీ షురూ.. ration-rice-distribution-in-kumarambhim-asifabad-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6622570-174-6622570-1585743839175.jpg)
ఆసిఫాబాద్‌లో రేషన్ బియ్యం పంపిణీ షురూ..
ఆసిఫాబాద్‌లో రేషన్ బియ్యం పంపిణీ షురూ..