కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాగజ్నగర్ పురపాలక వైస్ ఛైర్మన్ రాచకొండ గిరీశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ పోటీల్లో కాగజ్ నగర్ పట్టణంలోని మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అందమైన రంగవల్లులు వేశారు.