తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర సరిహద్దుల వెంట జనాలు ఇబ్బంది పడొద్దు' - రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసుల తనిఖీలు

రాష్ట్ర సరిహద్దుల వెంట జనాలు ఇబ్బంది పడకుండా చూడాలని చెక్​పోస్టు సిబ్బందికి రామగుండం సీపీ వి.సత్యనారాయణ సూచించారు. లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించారు.

ramagundam cp v.satyanarayana inspected state borders and gave suggestions to police personnel
'రాష్ట్ర సరిహద్దుల వెంట జనాలు ఇబ్బంది పడొద్దు'

By

Published : May 17, 2021, 8:02 PM IST

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కుమురం భీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్​​పోస్ట్​ను జిల్లా ఇన్​ఛార్జీ, రామగుండం సీపీ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. పొరుగు రాష్ట్రాల, జిల్లాల నుంచి వచ్చే వాహనాల తనిఖీలను పరిశీలించారు. ఉదయం 6 నుంచి 10 గంటల సమయంలోనే అన్ని పనులు చేసుకోవాలని, తర్వాత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనవసరంగా బయటకు వస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.

లాక్​డౌన్​ వేళ నిత్యావసర సరుకుల వాహనాల తప్ప, ఏ వాహనాన్నీ అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు. చెక్​పోస్టు వద్ద ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీపీ వెంట ఎస్పీ వై.వి.ఎస్ సుధీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్ రావు, వాంకిడి సీఐ సుధాకర్, ఎస్ఐ రమేష్, ఇతర పోలీస్ అధికారులున్నారు.

ABOUT THE AUTHOR

...view details