కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని కోలంగూడ, సర్కెపల్లిలో పోలీసులు మీకోసం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రహదారి, విద్యుత్ సౌకర్యం, బోరుబావి తీసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. పోలీసులకు ఆదివాసీలు గుస్సాడి నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సర్కెపల్లి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉందని... గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారని గుర్తు చేశారు.
వాంకిడి మండలంలో పోలీసులు మీకోసం కార్యక్రమం - తెలంగాణ వార్తలు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు మీకోసం కార్యక్రమం చేపట్టారు. ఇందులో రహదారి, విద్యుత్ సౌకర్యం, బోరు బావి తీసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. వాంకిడి పోలీసులను ఆయన అభినందించారు.
సమస్యలను తెలుసుకున్న వాంకిడి పోలీసులు గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రకాల సౌకర్యాలను కల్పించినట్లు సీపీ తెలిపారు. రహదారి, వైద్యం, విద్య అందుబాటులోకి వచ్చి మావోయిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా ఉంటారని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వాంకిడి పోలీసులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీంద్ర, అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Registrations: స్లాట్ బుకింగ్ లేకుండానే రిజిస్ట్రేషన్లు..