కుమురం భీం జిల్లా దహేగం మండలం రాళ్లగూడలో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లో చేధించారు. కౌటాల మండలానికి చెందిన రౌతు బండుకు, దహేగాం మండలం రాళ్లగూడాకు చెందిన కవితతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. బండు ఇళ్లరికం అల్లుడుగా వచ్చి రాళ్లగూడలోనే ఉంటున్నాడు. వీరికి ఏడేళ్ల పాప ఉంది.
కాగజ్నగర్ మండలం బురదగూడకు చెందిన బిక్కుతో కవిత ఏడాది కాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయంపై కవితను భర్త తరచూ నిలదిసేవాడు. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడు బిక్కుతో కలిసి భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది.
పథకం ప్రకారం ఆదివారం రాత్రి.... భర్త నిద్ర పోయాక ప్రియుడిని ఇంటికి రమ్మని కబురు పెట్టింది. రౌతుబండును కర్రతో బలంగా తలపై మోది చంపేశారు. మృతదేహాన్ని అదే రాత్రి... ద్విచక్రవాహనంపై కొత్మిర్ గ్రామ సమీపంలోని పత్తి చేనులో పడవేసి వెళ్లిపోయారు.
ప్రియుడితో కలిసి భర్తను ఖతం చేసింది.. మృతదేహాన్ని గమనించి గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకుని రిమాండుకు తరలించారు. 24 గంటల్లో కేసును చేధించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు